ఈ ఏడాది మే నెల వరకు 25కు పైగా కేంద్ర మంత్రిత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. 2016లో 199, 2017లో 172, 2018లో 110 ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ అయినట్లు వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగాసాంకేతిక పరిజ్ఞానం, ఇతర సేవల విస్తరణకు సైబర్ దాడులు సమస్యగా మారయన్నారు రవిశంకర్. ఈ దాడులకు ఓ పరిమితి లేదని, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా జరగే అవకాశముందని చెప్పారు.