కశ్మీర్‌లో జమ్ము-కిష్త్వర్ జాతీయ రహదారి వద్ద ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శనివారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు అనుమానిత వ్యక్తులు.. ఓ జవానును అడ్డగించడానికి ప్రయత్నించగా అతను తప్పించుకుని దగ్గర్లో ఉన్న భద్రతా దళాలకు సమాచారమందించాడు. వెంటనే స్పందించిన బలగాలు ముష్కరులపై కాల్పులు చేపట్టాయి.
కశ్మీర్‌లో ఉగ్ర కలకలం.. సైన్యం ముమ్మర గాలింపు - explosive a bomb
కశ్మీర్‌లో జమ్ము-కిష్త్వర్ జాతీయ రహదారి వద్ద ఉగ్రవాదులు కలకలం రేపారు. ఉగ్రమూకల సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. ముష్కరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర కలకలం
భద్రతా దళాలను పసిగట్టిన ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సైనికాధికారులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఉగ్రమూకల కోసం దళాలు ముమ్మర గాలింపు చేస్తున్నాయి. కాల్పల నేపథ్యంలో జమ్ము-కిష్త్వర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 'కార్టూనిస్టులకు పని కల్పిస్తోన్న ఇమ్రాన్‌ఖాన్'
Last Updated : Oct 2, 2019, 8:11 AM IST