జమ్ముకశ్మీర్ సరిహద్దులో మరోమారు దశ్చర్యకు పాల్పడింది పాకిస్థాన్. అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పల్లాన్వాలా ప్రాంతంలోని భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు పాక్ జవాన్లు.
మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం
జమ్ముకశ్మీర్ అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డారు పాకిస్థాన్ సైనికులు. దీటుగా సమాధానమిచ్చిన భారత సైన్యం.. ఇద్దరు దాయాది జవాన్లను హతమార్చింది.
మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం
పాక్ చర్యను దీటుగా తిప్పికొట్టాయి భారత బలగాలు. ఇద్దరు దాయాది దేశ సైనికులను మట్టుబెట్టినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం ఎల్ఓసీ వెంబడి రెండు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మృతదేహాలను భౌతికంగా ధ్రువీకరించలేకపోయినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: పౌర చట్టాన్ని సమర్థిస్తూ 1100 మంది ప్రొఫెసర్ల ప్రకటన