తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఊచకోత కేసు దర్యాప్తునకు మరో 2నెలల గడువు - సుప్రీం కోర్టు

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై సిట్​ దర్యాప్తు పూర్తి చేయటానికి మరో రెండు నెలలు గడువు పొడిగించింది సుప్రీం కోర్టు. 64 మంది పోలీసుల పాత్రపై విచారణ చేపట్టాలన్న పిటిషన్​పై కక్షిదారులకు నోటీసులు జారీ చేసింది.

ఊచకోత కేసు దర్యాప్తునకు మరో 2నెలల గడువు

By

Published : Mar 29, 2019, 2:31 PM IST

Updated : Mar 29, 2019, 4:26 PM IST

ఊచకోత కేసు దర్యాప్తునకు మరో 2నెలల గడువు
1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఊచకోతకు సంబంధించిన 186 కేసుల్లో ఇప్పటికే 50శాతం దర్యాప్తు పూర్తయిందని సిట్​ నివేదించింది. దర్యాప్తును పూర్తి చేయటానికి మరో రెండు నెలలు గడువు కావాలని అభ్యర్థించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది.

అల్లర్లలో 62 మంది పోలీసుల పాత్రపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ సభ్యుడు గుర్లాడ్​ సింగ్​ కహ్లోన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసుతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీచేసింది.

1984 అక్టోబర్​ 31న ఇందిరాగాంధీ హత్యానంతరం దిల్లీలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి. నాటి హింసలో 2వేల 733మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు గతేడాది జనవరి 11న సిట్​ ఏర్పాటు చేసింది.

Last Updated : Mar 29, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details