తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అతివేగం: డ్రైవర్​ నిర్లక్ష్యానికి 16 మంది బలి - ROAD ACCIDENT

ఉత్తరప్రదేశ్​లో రోడ్డు ప్రమాదం- 16 మంది మృతి

By

Published : Aug 27, 2019, 12:01 PM IST

Updated : Sep 28, 2019, 10:52 AM IST

12:41 August 27

16 మంది దుర్మరణం- సీఎం దిగ్భ్రాంతి

16 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్​పూర్​లోని జమ్​కా ప్రాంతం వద్ద ఓ ట్రక్కు మరో రెండు వాహనాలను( వ్యాన్​, టెంపో) ఢీకొట్టింది. అనంతరం ఆ ట్రక్కు తిరగబడింది. ఈ ఘటనలో 16 మంది ఘటనాస్థలంలోనే దర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ట్రక్కు వచ్చి వేగంగా ఢీకొనడం వల్ల వ్యాను పక్కనే ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో వ్యానులో ఉన్న వారంతా మరణించారు.

ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్​ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి... క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందివ్వాలని అధికారులను ఆదేశించారు.

11:41 August 27

ఉత్తరప్రదేశ్​లో ఘోర ప్రమాదం- 16 మంది మృతి

ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్‌లో ఓ ట్రక్కు తిరగబడి రెండు టెంపో వాహనాలపై పడింది. ఈ ఘటనలో 16మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Sep 28, 2019, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details