తమ రాజీనామాలతో కర్టాటక సంకీర్ణ కూటమి ప్రభుత్వం కూలడానికి కారణమైన అంసతృప్త ఎమ్మెల్యేలు తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ వారిపై వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామాలను తిరస్కరించి తమపై అనర్హత వేటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టుకు 14 మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు
కర్ణాటకలో అనర్హత వేటుకు గురైన 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తమ రాజీనామాలు తిరస్కరించి తమపై అనర్హత వేటు వేయడాన్ని వారు సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
సుప్రీం కోర్టుకు 14 మంది రెబల్ ఎమ్మెల్యేలు
ఇప్పటికే అనర్హత వేటు పడిన ఇద్దరు కాంగ్రెస్, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ 14 మందితో కలిపి ఆ సంఖ్య 17కి చేరింది. వీటిపై త్వరలోనే సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.