మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని కొంఢ్వా ప్రాంతంలో ఓ సొసైటీ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం రాత్రి 1.45 గంటల ప్రాంతంలో సొసైటీ పక్కనే భవన నిర్మాణ కూలీల కోసం వేసిన తాత్కాలిక షెడ్లపై గోడ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు కూలీలు.