మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా ఒంటరిగానే భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలంతా భాజపాలో చేరతారని అనుకున్నప్పటికీ.. అందుకు భిన్నంగా జరిగింది. సింధియా వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో 13 మంది పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అనడం చర్చనీయాంశమైంది.
"వారు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరు. సింధియాను రాజ్యసభకు నామినేట్ చేయాలనే విషయంలో పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ విధంగా చేశారు. కమల్నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది. మధ్యప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మౌనంగా ఉండబోము. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం శివరాజ్ సింగ్ ప్రయత్నించినా.. అవి విఫలం కావడం వల్లే భాజపా జోతిరాదిత్యను రంగంలోకి దింపింది. జోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసినా.. ఆయన తన మనిషిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని సూచించారు. అందుకు కమల్నాథ్ నిరాకరించారు. కేంద్ర మంత్రి పదవి కోసమే సింధియా భాజపాలో చేరారు."
- దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
దిగ్విజయ్ వ్యాఖ్యలతో రిసార్ట్ రాజకీయం మరింత వేడెక్కింది. ఇది ఎంత కాలం కొనసాగనుంది? మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత మంది మద్దతు ఇస్తారు? భాజపాలో ఎంత మంది చేరతారు? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
సింధియాతోనే ఉంటా..