తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరప్రదేశ్​లో కల్తీ మద్యానికి 12 మంది బలి - BARABANKI

కల్తీ మద్యం సేవించి ఉత్తరప్రదేశ్​ బారాబంకీ జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కల్తీ మద్యంపై వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్​ చేశారు.

ఉత్తరప్రదేశ్​లో కల్తీ మద్యానికి 12 మంది బలి

By

Published : May 28, 2019, 10:41 AM IST

Updated : May 28, 2019, 11:31 AM IST

కల్తీ మద్యం వల్ల 12 మంది మృతి

ఉత్తరప్రదేశ్​ బారాబంకీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారు. వీరిలో రామ్​నగర్​ గ్రామస్తులు 8మంది, రాణిగంజ్​ గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మరొక బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరికొందరికి చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కల్తీ మద్యం తమ వారిని బలితీసుకుందని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

"మా నాన్న నిన్న ఉద్యోగానికి వెళ్లారు. సాయంత్రం వచ్చి మద్యం సేవించారు. ముగ్గురు సోదరులూ మద్యం తాగారు. అందరు మరణించారు. మేమందరం రాణిగంజ్​లో ఉంటాం. "
--వికాస్​, మృతుల కుటుంబీకుడు

బారాబంకీ జిల్లాలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

Last Updated : May 28, 2019, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details