దేశంలో యూకే రకం కరోనా క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 102 మంది కొత్త రకం వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచినట్లు తెలిపింది. బాధితుల తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులు, బంధువులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొంది.
భారత్‌లో 100 దాటిన కొత్త రకం కరోనా కేసులు - 102 people found infected with UK strain of coronavirus: Health Ministry
భారత్‌లో కొత్త రకం కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 102 మందికి యూకే స్ట్రెయిన్ వైరస్ నిర్ధరణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితులందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచినట్లు తెలిపింది.
భారత్‌లో 100 దాటిన కొత్తరకం కరోనా కేసులు
డెన్మార్క్, నెథర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్ల్యాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ తదితర దేశాల్లో యూకే స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
ఇదీ చదవండి :'టీకా పంపిణీలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం'
TAGGED:
Total cases of new covid