అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో 10 అడుగుల పొడవున్న కొండచిలువ నడి ఊళ్లోకొచ్చి హల్చల్ చేసింది. మెన్మెజీ గ్రామంలోకి మేకను ఆరగించేందుకు ప్రయత్నించిన భారీ పామును గ్రామస్థులు బంధించారు. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.
మేక కోసం వచ్చి చిక్కిన కొండచిలువ!
10 అడుగుల భారీ సరీసృపం మేకను మింగేందుకు ఊర్లోకి వచ్చింది. గ్రామస్థులకు చిక్కింది. ఆఖరికి అటవీ అధికారుల చేతికి వెళ్లిపోయింది.
మేక కోసం వచ్చి దొరికిపోయిన కొండచిలువ!
మెన్మెజీ ప్రాంతంలో ఈ పొడవైన కొండచిలువ తరచుగా కనిపిస్తూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసేది. ఎట్టకేలకు అటవీ అధికారులు పామును తీసుకువెళ్లారు.
ఇదీ చూడండి:ఔరా: చెత్త ఇచ్చుకో.. ఆకలి తీర్చుకో!