తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోషల్​ మీడియాలో సగం వార్తలు నకిలీవే! - IGPP

ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల వ్యాప్తి భారీగా పెరిగింది. గడిచిన 30 రోజుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి నకిలీ వార్తలే వచ్చినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇన్​స్టిట్యూట్​​ ఫర్​ గవర్నెన్స్​, పాలసీస్​, పాలిటిక్స్​ (ఐజీపీపీ) సంస్థ చేసిన సర్వేలో 53 శాతం మంది నకిలీ వార్తలు పొందినట్లు తేలింది.

సోషల్​ మీడియాలో సగం వార్తలు నకిలీవే!

By

Published : Apr 10, 2019, 7:34 AM IST

సోషల్​ మీడియాలో సగం వార్తలు నకిలీవే!

దేశంలో సాధారణ ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల వ్యాప్తి భారీగా పెరుగుతోంది. గడిచిన 30 రోజుల్లో ఫేస్​బుక్​, వాట్సప్​ వంటి మాధ్యమాల్లో వచ్చిన సమాచారంలో సగానికిపైగా నకిలీ వార్తలేనని ఓ సర్వే తెలిపింది. సోషల్​ మీడియా వినియోగించే ప్రతి ఇద్దరిలో ఒకరికి నకిలీ వార్తలే అందుతున్నాయని ఇన్​స్టిట్యూట్​​​ ఫర్​ గవర్నెన్స్​, పాలసీస్​, పాలిటిక్స్​ (ఐజీపీపీ) సర్వే తేల్చింది.

సర్వేలోని అంశాలు:

  • వివిధ సామాజిక మాధ్యమాల వేదికల్లో సుమారు 53 శాతం మంది నకిలీ వార్తలు వచ్చినట్లు పేర్కొన్నారు.
  • వినియోగదారులను తప్పుదోవ పట్టించేందుకు ఫేస్​బుక్​, వాట్సప్​లనే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తేలింది. గడిచిన 30 రోజుల్లో ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు నకిలీ వార్తలు వచ్చినట్లు ఒప్పుకున్నారు.
  • సోషల్​ మీడియాలోని సమాచారం నిజమైందా కాదా అని సుమారు 41 శాతం మంది గూగుల్​, ఫేస్​బుక్​, ట్విట్టర్​లో తనిఖీ చేస్తున్నారు.
  • భారత్​లో సుమారు యాభై లక్షల మంది ఓటర్లు అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. ఈ నకిలీ వార్తల వల్ల ఎన్నికలపై భారీ స్థాయిలో ప్రభావం ఉంటుంది.
  • దేశవ్యాప్తంగా 628 మంది ఓటర్లపై నమూనా సర్వే నిర్వహించారు. అందులో 56 శాతం మంది పురుషులు, 43 శాతం మంది మహిళలు, 1 శాతం ట్రాన్స్​జెండర్స్​ ఉన్నారు.

నకిలీ వార్తల వ్యాప్తిపై వాట్సప్​ సంస్థను సంప్రదించగా 2019 ఎన్నికల నేపథ్యంలో నకిలీ వార్తల కట్టడికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపిందని ఐజీపీపీ వెల్లడించింది. ఫేస్​బుక్​ స్పందించటానికి నిరాకరించినట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details