తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ బయోటెక్ ఛైర్మన్​ కృష్ణ ఎల్లాకు భద్రత పెంపు - సీఐఎస్​ఎఫ్​

కొవాగ్జిన్​ టీకా ఉత్పత్తి సంస్థ భారత్​ బయోటెక్ ఛైర్మన్​ కృష్ణ ఎల్లాకు 'వై' కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆయనకు ఇప్పటికే సీఐఎస్​ఎఫ్​ భద్రత కొనసాగుతోంది.

Bharat Biotech chairman
భారత్​ బయోటెక్

By

Published : Jun 29, 2021, 9:02 PM IST

Updated : Jun 29, 2021, 9:32 PM IST

భారత్​ బయోటెక్ ఛైర్మన్​ కృష్ణ ఎల్లాకు 'వై' కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి చేస్తోంది. టీకాలకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో ఆయనకు వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇద్దరు లేదా ముగ్గురు కమాండోలు ఆయన వెన్నంటే ఉంటారు. ఇప్పటికే కృష్ణ ఎల్లాకు సీఐఎస్​ఎఫ్​ భద్రత కొనసాగుతోంది.

52 ఏళ్ల కృష్ణ ఎల్ల.. హైదరాబాద్​లో భారత్​ బయోటెక్​ను స్థాపించారు. కరోనా టీకాతో పాటు ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సహా పలు ఇతర టీకాలను ఆ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

విద్రోహ శక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో హైదరాబాద్​ శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్​ బయోటెక్ ప్లాంట్​కు ఇటీవలే సీఐఎస్​ఎఫ్​ భద్రత కల్పించింది కేంద్రం.

ఇదీ చూడండి:డాక్టర్‌ కృష్ణ ఎల్లకు 'ఫోర్బ్స్'‌ అరుదైన గౌరవం

Last Updated : Jun 29, 2021, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details