బంగాల్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. గత వారం బంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయంటూ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మమతా. అభివృద్ధిలో దేశంలోనే బంగాల్ ముందంజలో ఉందని వెల్లడించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, నేరాలు తగ్గాయన్నారు. కోల్కతా నగరం రెండు సార్లు 'సేఫ్టీ సిటీ'గా ఎంపికైందని గుర్తు చేశారు.
"హోం మంత్రి( అమిత్ షా) ఏదైనా చెబితే.. దానికి రిపోర్టులు, డేటా ఉండాలి. అభివృద్ధిలో బంగాల్ దేశంలోనే ముందంజలో ఉంది. కానీ బంగాల్ను దిగజార్చే పనిలో షా ఉన్నారు."
--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి