తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం.. కొన్ని గంటల తర్వాత - కర్ణాటకలో ఉప్పులో బాలుడి మృతిదేహం

మార్స్​పైకి రాకెట్లు పంపిస్తున్న కాలంలోనూ.. మూఢ నమ్మకాలతో అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నమ్మకాలకు ఆశ తోడైతే.. వారి మెదళ్లను ఎవరూ ఆపలేరు. చనిపోయిన కుమారుడు బతికొస్తాడని.. ఉప్పులో గంటల పాటు మృతదేహాన్ని ఉంచారో దంపతులు. అలాంటి ఓ ఘటనే కర్ణాటకలో జరిగింది.

parents put son dead body in salt
Believing in superstition parents kept their son dead body in salt- Why

By

Published : Sep 5, 2022, 6:55 PM IST

మూఢనమ్మకానికి ఆశ తోడైంది. దీంతో చనిపోయిన తమ కుమారుడు బతికొస్తాడని మృత దేహాన్ని గంటల పాటు ఉప్పులో ఉంచారీ దంపతులు. ఎంతసేపటికీ బాలుడిలో చలనం రాలేదు. దీంతో చేసేదేమీ లేక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకెళ్లే..సిర్​వారా అనే గ్రామంలో ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి నీటి గుంటలో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. ఐదు బస్తాల ఉప్పు తెచ్చి మృత దేహంపై పోశారు. గంటలు గడిచినా బాలుడిలో చలనం లేదు, ప్రాణాలతో తిరిగి రాలేదు. దీంతో తమ కుమారుడు తిరిగి రాడని అంత్యక్రియలు పూర్తి చేశారు.

అయితే ఎవరైనా నీళ్లలో పడి చనిపోతే.. ఇలా వారిని ఉప్పులో ఉంచితే ప్రాణాలతో వస్తారని వారికి ఎవరో చెప్పారు. తమ కుమారుడికి ఇలా జరగడం వల్ల ఆ విషయం గుర్తుకు వచ్చి ఇలా చేశారు. గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయి. ఇలాంటి విషయాల్లో ప్రజలను చైతన్య పరిచి.. మూఢ నమ్మకాలతో జరిగే అనర్థాలను అరికట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పులో బాలుడి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details