తెలంగాణ

telangana

ETV Bharat / bharat

BEL Jobs 2023 : ఇంజినీర్లకు గుడ్​న్యూస్​.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్​ - btech jobs govt

BEL RECRUITMENT 2023 : ఇంజినీరింగ్ చేసిన ఉద్యోగార్థులకు మంచి అవకాశం. భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 205 పోస్టుల భర్తీ కోసం జాబ్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. దరఖాస్తుకు ఆఖరి తేదీ 2023 జూన్​24. పూర్తి వివరాలు మీ కోసం.

BEL notification 2023 for trainee engineers
బెల్​లో ట్రైనీ ఇంజినీర్ల పోస్టులకు నోటిఫికేషన్​

By

Published : Jun 11, 2023, 1:23 PM IST

BEL RECRUITMENT 2023 : భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ తాజాగా 205 'ట్రైనీ ఇంజినీర్​, ప్రోజెక్ట్​ ఇంజినీర్​ పోస్టు'ల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000 వేతనం ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ 2023 జూన్​ 24.

పోస్టుల వివరాలు

  • ట్రైనీ ఇంజినీర్ I​ (జాబ్​ కోడ్ FLC01) - 125 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ I (జాబ్​ కోడ్​ SPS02) - 09 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ I (జాబ్​ కోడ్​ MH03) - 08 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ I (జాబ్​ కోడ్​ EVM04) - 43 పోస్టులు
  • ట్రైనీ ఇంజినీర్​ I (జాబ్​ కోడ్​ SK05) - 06 పోస్టులు
  • ప్రోజెక్ట్​ ఇంజినీర్​ I (జాబ్​ కోడ్​ EVM06) - 14 పోస్టులు

బెల్​ రిక్రూట్​మెంట్​ టెన్యూర్

  • ప్రోజెక్ట్​ ఇంజినీర్​ I పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్ల పాటు బీఈఎల్​లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్​ అవసరాల దృష్ట్యా, అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా.. మరో ఏడాది పాటు వారి టెన్యూర్​ పొడిగించే అవకాశం ఉంటుంది. అంటే గరిష్ఠంగా 4 ఏళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది.
  • ట్రైనీ ఇంజినీర్​ I పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 2 ఏళ్ల పాటు బీఈఎల్​లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్​ అవసరాల దృష్ట్యా, అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా.. మరో ఏడాది పాటు వారి టెన్యూర్​ పొడిగించే అవకాశం ఉంటుంది. అంటే గరిష్ఠంగా 3 ఏళ్ల పాటు సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి
ట్రైనీ ఇంజినీర్​​ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 28 ఏళ్లు. కాగా ప్రోజెక్ట్​ ఇంజినీర్​ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు ఉంటుంది.

వేతనాలు

  • ప్రాజెక్ట్​ ఇంజినీర్లకు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.55,000 చొప్పున వేతనం ఇస్తారు.
  • ట్రైనీ ఇంజినీర్లకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.35,000, మూడో ఏడాది రూ.40,000 చొప్పున్న వేతనం అందిస్తారు.

విద్యార్హతలు
బెల్​ నోటిఫికేషన్​ 2023లో పేర్కొన్న విధంగా ఆయా పోస్టులకు సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల వ్యవధి గల ఇంజినీరింగ్​ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించినవారిని కేటగిరీల వారీగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ వివరాలు తరువాత వెల్లడిస్తామని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

అప్లికేషన్​ ఫీజు
అభ్యర్థులు కేవలం ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్​ ఇంజినీర్​ పోస్టులకు అప్లై చేసే జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.400 అప్లికేషన్​ ఫీజు + 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ట్రీనీ ఇంజినీర్​ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.150 దరఖాస్తు రుసుముతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details