తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇదొక సూపర్​ స్పెషల్ బీర్- ధర రూ.60!

బీరు ప్రియులకు తీపి కబురు అందించారు త్రిపురకు చెందిన సమీర్ జమాతియా అనే వ్యక్తి. వెదురును ఉపయోగించి సరికొత్త బీర్​ను ఆయన తయారు చేశారు. ఇది రుచికరంగానే కాకుండా ఆరోగ్యకరంగానూ ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఇంతకీ బీర్​ కథాకమామిషు ఏంటంటే..

bamboo beer
వెదురుతో బీర్​

By

Published : Jun 6, 2021, 4:15 PM IST

దేశీయ పానీయాలకు పేరు గాంచిన ప్రదేశం త్రిపుర. బియ్యంతో తయారు చేసే 'రైస్​ బీర్' ఇక్కడ ఎంతో ఫేమస్​. తాజాగా అదే కోవలో.. ఈ ప్రాంతానికే చెందిన సమీర్​ జమాతియా అనే ఓ వెదురు సాంకేతిక నిపుణుడు.. సరికొత్త బీర్​ను ప్రపంచానికి పరిచయం చేశారు. అదే వెదురు తయారు చేసిన బీర్​. దీనికి 'బాంబూ బీర్'​ అని పేరు పెట్టారాయన.

చైనాలో నేర్చుకుని..

చైనాలో చాలా కాలం పాటు ఉన్న సమీర్​.. అక్కడ వెదురు సాంకేతికత గురించి చదువుకున్నారు. తక్కువ ధరకే ఆరోగ్య విలువలు ఉన్న వెదురు బీర్​ను తయారు చేసిన ఆయన.. తమ రాష్ట్రానికే ఇప్పుడు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టారు. తన బీర్​కు మంచి ఆదరణ దొరికితే.. స్థానిక బేవరేజ్​ వ్యాపారం​ జోరుగా సాగుతుందని చెప్పారు.

సమీర్​ జమాతియా తయారు చేసిన వెదురు బీర్​

జపాన్​, చైనాలో ప్రాచుర్యం పొందిన వెదురు ఆకుల టీని భారత్​లో తయారు చేసి విశేషాదరణ పొందారు సమీర్​. దాన్ని ఆయన వివిధ రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేశారు. ఇప్పుడు ఈ వెదురు బీర్​ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. "నా పానీయానికి ల్యాబ్​ టెస్టు ధ్రువీకరణ పత్రం వస్తే... నేను భారీ స్థాయిలో ఈ వెదురు బీర్​ను ఉత్పత్తి చేస్తాను. ట్రేడ్​మార్క్​ కోసం ఎదురు చూస్తున్నాను. అది త్వరలో వస్తుందని ఆశిస్తున్నాను." అని 'ఈటీవీ భారత్'​తో జమాతియా చెప్పారు.

సమీర్​ జమాతియా

ఎలా తయారు చేస్తారంటే..?

ఆహార ధాన్యాల ద్రావణం ఉపయోగించి ఈ బీర్​ను తయారు చేస్తానని ఆయన చెప్పారు. అనంతరం దాన్ని వెదురు పొడిలో పులియబెడతానని తెలిపారు. వెదురులో యాంటీబ్యాక్టీరియల్​ గుణాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు. ఈ బీర్​ ధర రూ.60 నుంచి రూ.70 మధ్య ఉంటుందని జమాతియా చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బీర్​ ధరల్లో ఇది సగమేనని పేర్కొన్నారు. మార్కెట్లో దీనికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నానన్నారు.

ఇదీ చూడండి:బెదరని వనిత.. కింగ్​ కోబ్రాను చేతపట్టి..

ఇదీ చూడండి:'టీకా కేంద్రం'లో పుట్టినరోజు వేడుకలు

ABOUT THE AUTHOR

...view details