కరోనా వైరస్ రెండో ఉద్ధృతి నుంచి ఊపిరి పీల్చుకుంటుండగానే నిఫా వైరస్ రూపంలో మరో ఉపద్రవం వచ్చిపడేలా ఉంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో నిఫా వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ వివరాలు బయటపెట్టింది.
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ గుహలో వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా.. వాటిల్లో నిఫా వైరస్ వ్యాపించినట్లు తేలింది. రాష్ట్రంలో ఇంతకుమునుపెన్నడూ ఈ వైరస్ను గుర్తించలేదని పరిశోధన బృందం నాయకురాలు డా. ప్రాద్య్న యాదవ్ తెలిపారు.