Barmer daughter: రాజస్థాన్లోని బాడ్మేడ్ జిల్లాలో ఓ నవ వధువు.. వరకట్నం కింద తన తండ్రి ఇచ్చిన రూ. 75లక్షలను బాలికల వసతి గృహ నిర్మాణం కోసం విరాళంగా అందజేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా బాడ్మేర్, జైసేల్మర్ ప్రాంతాల్లో అనేకమంది బాలికలకు విద్యాభ్యాసం సులభతరం కానుంది.
బాడ్మేర్ జిల్లాకు చెందిన యువతి అంజలికి ప్రవీణ్ సింగ్ అనే వ్యక్తితో ఈ నెల 21న వివాహమైంది. కట్నం కింద చెక్కు కావాలని ఆమె తన తండ్రిని ముందే అడిగారు. ఆయన అనుమతితో రూ. 75 లక్షలు చెక్కు రాసి బాడ్మేర్లో వసతి గృహానికి అందించారు.
తండ్రి పోత్సాహంతో..