తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్కారు బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. కళ్లుచెదిరే వేతనం.. - బ్యాంకు నోటిఫికేషన్

Bank of India Recruitment: బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గుడ్​న్యూస్. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు ఇలా..

BANK NOTIFICATION
Bank of India Recruitmentbank of india recruitment

By

Published : Apr 24, 2022, 4:51 PM IST

Bank of India Recruitment: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. 696 ఖాళీలను భర్తీ చేసేందుకు కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది బీఓఐ. ఐటీ అధికారులు, మేనేజర్లు, సాంకేతిక నిపుణులు, క్రెడిట్ ఆఫీసర్లు, ఆర్థికవేత్తలు, గణాంకవేత్తలను ఈ ప్రక్రియ ద్వారా నియమించుకోనుంది.

ఖాళీల వివరాలు ఇలా..
• మొత్తం పోస్టులు - 696
• రెగ్యులర్ తరహాలో భర్తీ చేసేవి - 594
• కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేవి - 102

రెగ్యులర్ పోస్టుల వివరాలు
• ఆర్థికవేత్త - 2
• గణాంకవేత్త - 2
• రిస్క్ మేనేజర్ - 2
• క్రెడిట్ అనలిస్ట్ - 53
• క్రెడిట్ ఆఫీసర్ - 484
• టెక్ అప్రైసల్ - 9
• ఐటీ ఆఫీసర్.. డేటా సెంటర్ - 42

ముఖ్యమైన తేదీలు
• ఏప్రిల్ 24 నుంచి ఆన్​లైన్ మాధ్యమం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• దరఖాస్తుకు మే 10 చివరి తేదీ
• పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

హైదరాబాద్​, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దేహ్రాదూన్, జైపుర్, జమ్ము, కోల్​కతా, లఖ్​నవూ, ముంబయి, పనాజీ, పట్నా, రాంచీ, శిమ్లా, తిరువనంతపురం నగరాల్లో ఆన్​లైన్ పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

జీతభత్యాలు..

• ఈ పోస్టులకు ఎంపికైతే ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. నాలుగు వేతన స్కేల్​ల ప్రకారం చెల్లింపులు ఉండనున్నాయి. కనిష్ఠంగా రూ.36వేలు.. గరిష్ఠంగా రూ.89,890 వేతనం లభించనుంది.

అర్హతలు
• ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బ్యాంకు నిర్దేశించిన కనీస విద్యా అర్హతలు ఉండాలి. వీటితో పాటు సంబంధిత ఫీల్డ్​లో తగిన అనుభవం ఉండాలి. వయసు పరిమితికి లోబడి ఉండాలి. ఈ అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్​లో ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ
• సంబంధిత పోస్టుకు వచ్చిన దరఖాస్తులను షార్ట్​లిస్ట్ చేసి ఆన్​లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఎలా అప్లై చేసుకోవాలి?
www.bankofindia.co.in అనే వెబ్​సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు
• ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
• జనరల్ కేటగిరీ, ఇతరులకు రూ.850

ఇదీ చదవండి:ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసింది... ఇంజినీర్ పోస్టులకు కూడా..

ABOUT THE AUTHOR

...view details