Bank of Baroda Recruitment 2023 : బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్. కొంచెం దృష్టి పెట్టి, సీరియస్ గా సన్నద్ధమవుతే.. బ్యాంకు కొలువు మీదే. దేశంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాది రెండో స్థానం. గుజరాత్‌లోని వడోదర ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్న 157 మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాల్ని తమ అధికారిక వెబ్సైట్లో పెట్టింది.
Bank of Baroda job vacancy 2023 : ఆ వివరాల ప్రకారం.. మొత్తం 157 ఖాళీలున్నాయి. అందులో రిలేషన్ షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్టు, ఫోరెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులున్నాయి. ఇందులో రిలేషన్ షిప్ మేనేజర్ - 66, క్రెడిట్ అనలిస్టు - 74, ఫోరెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్ - 17 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల అర్హత విషయానికొస్తే.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక పోస్టుల పరంగా చూస్తే.. రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్, ఫైనాన్స్ (ఏడాది కోర్సు)లో స్పెషలైజేషన్ ఉండాలి.
క్రెడిట్ అనలిస్టు పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ ఉండాలి. లేదా సీఏ, సీఎమ్ఏ, సీఎస్, సీఎఫ్ఏ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు గానూ.. ఏదైనా గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా మార్కెటింగ్, సేల్స్‌లో డిప్లొమా ఉండాలి.