తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలపు వలలో బ్యాంక్ మేనేజర్.. 'ఆమె'కు రూ.6కోట్లు గిఫ్ట్.. 'దొంగ లోన్​'తో బడా స్కామ్! - కర్ణాటక న్యూస్​

ఆన్​లైన్​ డేటింగ్​ యాప్​లో పరిచయమైన యువతి వలలో పడి ఓ బ్యాంకు మేనేజర్ భారీ​ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ కస్టమర్ ఖాతా నుంచి అక్రమ పత్రాలతో రూ.6 కోట్ల రుణం మంజూరు చేసి ఆ యువతికి ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

bank manager arrested in bengaluru
bank manager arrested in bengaluru

By

Published : Jun 24, 2022, 7:24 PM IST

బ్యాంకు మేనేజర్​ హోదాలో ఉన్న వ్యక్తి వలపు వలలో పడ్డాడు. ఆన్​లైన్​ డేటింగ్​ యాప్​లో పరిచయమైన ఆ యువతి ఉచ్చులో పడి భారీ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ కస్టమర్ ఖాతా నుంచి అక్రమంగా రూ.6 కోట్లు రుణం తీసి ఆ యువతి ఖాతాలో వేశాడు. బ్యాంకు అంతర్గత తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీనిపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేయడం వల్ల బ్యాంకు మేనేజర్​ సహా అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కర్ణాటక బెంగళూరుకు చెందిన హరిశంకర్​ ఇండియన్​ బ్యాంకు హనుమంతనగర్​ శాఖలో మేనేజర్​గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల కిందట ఓ డేటింగ్​ యాప్​లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతి అతడికి పరిచయమైంది. రోజూ మెసేజ్​ చేస్తూ అతడిని ఆకట్టుకుంది. ఓ రోజు డబ్బులు కావాలంటూ అడగగా.. రూ.12 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు ఇవ్వాలని కోరింది. బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా రూ. 6 కోట్లు రుణాన్ని తీసి యువతి ఖాతాలో వేశాడు హరిశంకర్.

అంతకుముందు అనిత తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్​ చేసుకుంది. తాజాగా రుణం కోసం దరఖాస్తు చేసుకుని.. దానికి సంబంధించిన పత్రాలను సమర్పించింది. అయితే, హరిశంకర్​ వాటిని తారుమారు చేసి రూ.6కోట్లు రుణం మంజూరు చేశాడు. ఆ డబ్బును డేటింగ్ యాప్​లో పరిచయమైన యువతికి ఇచ్చాడు.

మే 13న అనితకు సంబంధించిన ఫిక్స్​డ్​ డిపాజిట్​ ఖాతా నుంచి రుణం ఇవ్వగా.. మే 19న అంతర్గతంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. జోనల్​ మేనేజర్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరిశంకర్ సహా అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం చేసినట్లు అంగీకరించాడు. హరిశంకర్​ను బుధవారం కోర్టులో హజరుపర్చగా.. 10 రోజుల పోలీస్​ కస్టడీ విధించింది.

ఇదీ చదవండి:కొండ చిలువ గుడ్లను పొదిగించిన పాము సంరక్షకులు.. 8 పిల్లలను అడవిలో..

ABOUT THE AUTHOR

...view details