punjab and sind bank recruitment 2023 : బ్యాంకు ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్. 'పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు'.. 183 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు ఇలా
- ఐటీ ఆఫీసర్ - 24
- రాజభాష ఆఫీసర్ - 7
- సాఫ్ట్వేర్ డెవలపర్ - 9
- లా మేనేజర్ - 6
- ఛార్టర్డ్ అకౌంటెంట్ - 16
- ఐటీ మేనేజర్ - 17
- సెక్యూరిటీ ఆఫీసర్ - 11
- డిజిటల్ మేనేజర్ - 2
- ఫారెక్స్ ఆఫీసర్ - 8
- డిజిటల్ మేనేజర్ - 2
- రిస్క్ మేనేజర్ - 5
- ఫారెక్స్ డీలర్ - 2
- ట్రెజరీ డీలర్ - 2
- ఎకానిస్ట్ ఆఫీసర్ - 2
విద్యార్హతలు ఏమిటి?
విద్యార్హతలు ఆయా పోస్టులకు అనుగుణంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ / పీజీ డిగ్రీ/ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ / బీటెక్/ బీఈ/ సీఏ/ఎంసీఏ/ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్లోని నోటిఫికేషన్ వివరాలు చూడండి.
అభ్యర్థుల వయోపరిమితి ఎంత ఉండాలి?
- కనీస వయోపరిమితి : 25 సంవత్సరాలు
- గరిష్ఠ వయోపరిమితి : 35 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము ఎంత చెల్లించాలి?
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.150 + జీఎస్టీ ఛార్జీలు చెల్లించాలి. అంటే మొత్తం రూ.177 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
- మిగతా కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.850 + జీఎస్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.1,003 ఆన్లైన్లో చెల్లించాలి.