Zubair Case: వివాదాస్పద ట్వీట్ కేసులో జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు ఊరట లభించింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేసిన వ్యవహారంలో దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.50వేలు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు అడిషనల్ సెషన్స్ జడ్జి దేవేందర్ కుమార్ జంగ్లా. అయితే.. జుబైర్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు.
2018లో ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా జుబైర్ వ్యవహరించారంటూ గతనెల 27న దిల్లీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు బెయిల్ కోసం జుబైర్ పెట్టుకున్న అభ్యర్థనను ఈనెల 2న కోర్టు తిరస్కరించింది.
ఆల్ట్ న్యూస్ జుబైర్‌కు బెయిల్.. కానీ... - జుబైర్
Zubair Case: ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశారన్న కేసులో జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు బెయిల్ లభించింది. అయితే.. అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం షరతు విధించింది.
జుబేర్
Last Updated : Jul 15, 2022, 3:12 PM IST