తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Dog Baby Shower: శునకానికి సీమంతం.. ఇరుగుపొరుగు దీవెనలు!

Baby Shower ceremony: తమిళనాడులో ఓ శునకానికి వైభవంగా సీమంతం చేశారు. ఇరుగుపొరుగువారు, సన్నిహితులను ఆహ్వానించి.. ఘనంగా వేడుక చేశారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Baby Shower for Dog
శునకానికి శ్రీమంతం

By

Published : Dec 6, 2021, 4:47 PM IST

Updated : Dec 6, 2021, 6:57 PM IST

వైభవంగా శునకానికి సీమంతం

Baby Shower ceremony: తమిళనాడు మదురై జిల్లాలో.. పెంపుడు శునకానికి సీమంతం చేసింది ఓ కుటుంబం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ శునకాన్ని సొంత బిడ్డలా చూసుకుంటున్నామని ఆ కుటుంబం చెబుతోంది.

సుజీ
సీమంతం కోసం అలంకరించిన సుజీ

జైహింద్‌పురానికి చెందిన శక్తివేల్​ మదురై కార్పొరేషన్‌లో సబ్​ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన.. సుజీ అనే కుక్కను పెంచుకుంటున్నారు. అది ఇటీవల గర్భం దాల్చగా.. వైభవంగా సీమంతం చేయాలని నిర్ణయించుకున్నారు​. ఈ కార్యక్రమానికి ఇరుగుపొరుగువారు, స్నేహితులు, సహచరులను కూడా ఆహ్వానించారు.

గర్భిణి శునకానికి అన్నం తినిపిస్తున్న శక్తివేల్​
సుజీని అశీర్వదిస్తున్న శక్తివేల్​

సుజీకి పూలమాల వేసి అలంకరించారు. ఐదు రకాల బియ్యంతో వంటలు చేసి తినిపించారు కుటుంబ సభ్యులు. అతిథులందరికీ భోజనాలు పెట్టారు. సీమంతానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్లు.. దానికి కుంకుమ రాసి, గాజులు వేశారు. హారతి ఇచ్చి సుజీని ఆశీర్వదించారు.

సుజీ సీమంతానికి చేసిన ప్రత్యేక వంటకాలు
సుజీకి హారతిస్తున్న కుటుంబ సభ్యులు

"నాకు చిన్నప్పటి నుంచి శునకాలంటే చాలా ఇష్టం. వాటిని పెంపుడు జంతువులని చెప్పడం కంటే.. మా కుటుంబ సభ్యులనే చెప్పొచ్చు. మేం ఏది తింటే.. వాటికి అదే పెడతాం. కాబట్టి సుజీ గర్భిణీ అని తెలియగానే.. దానికి సీమంతం చేయాలని నిర్ణయించుకున్నాం."

- శక్తివేల్​

సుజీ సీమంతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో శక్తివేల్​పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప పని చేశారంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

ఎస్​ఐ శక్తివేల్​
పెంపుడు శునకాలతో కుటుంబ సభ్యుడు

ఇదీ చూడండి:బురదలో ఆడిపాడిన చిన్నారులు, మహిళలు.. ఎందుకంటే?

Last Updated : Dec 6, 2021, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details