తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లి, తమ్ముడిని కాపాడిన రెండేళ్ల పాప - మురాదాబాద్

రైల్వే వంతెనపై స్పృహతప్పి పడిపోయిన తల్లిని, తమ్ముడిని కాపాడిందో చిన్నారి. తల్లి వద్దే కూర్చుని ఏడవకుండా.. పరిస్థితిని అర్థం చేసుకుని రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. వారు ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

two year girl saves mother and brother
తల్లి, సోదరుడిని కాపాడిన రెండేళ్ల పాప

By

Published : Jul 4, 2021, 3:17 PM IST

రైల్వే స్టేషన్​లో దృశ్యాలు

ఆ చిన్నారికి సరిగ్గా మాటలే కాదు.. నడక కూడా రాదు. కానీ తన చిట్టి తమ్ముడిని, తల్లిని కాపాడింది.

పిల్లలను చూసుకోవాల్సిన తల్లి ఓ రైల్వే వంతెనపై స్పృహతప్పి పడిపోయింది. తన తమ్ముడిది పాలు తాగే వయసు.. గుక్కబట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితిలో రెండు, మూడేళ్ల పాప ఏం చేయగలదు? వారి పక్కన కూర్చొని ఏడవడం తప్ప! కానీ ఆ చిన్నారి అలా చేయలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని.. రైల్వే పోలీసులకు సమాచారం అందించి.. వారి ప్రాణాలను రక్షించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మురాదాబాద్​లోని ఓ రైల్వే స్టేషన్​లో జరిగింది.

స్పృహ తప్పి పడిపోయిన తల్లి పక్కన చిన్నారి
పోలీసులను వెంటబెట్టుకొని వస్తున్న పాప

ఏం జరిగింది?

తల్లికి స్పృహలేదు. తమ్ముడు ఏడుస్తున్నాడు. ఆ చిన్నారి.. బుడిబుడి అడుగుల వేసుకొని నెమ్మదిగా వంతెన దిగింది. కానీ అక్కడి ఎవరికి ఈ విషయం చెప్పాలో తెలియక.. రైల్వే మహిళ పోలీసు వైపు కళ్లు పెద్దవి చేసి చూస్తూ.. నిల్చుంది. ఏదో చెప్పాలని చూస్తున్న ఆ చిన్నారి మనసును అర్థం చేసుకుంది. దగ్గరకు వెళ్లి, ఏం జరిగిందని పోలీసుల అడితే.. సరిగ్గా చెప్పలేకపోయింది. పోలీసులను తన తల్లి వద్దకు తీసుకెళ్లింది. అక్కడి వెళ్లి.. చిన్నారి తల్లిని చూసి.. వెంటనే అంబులెన్స్​లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు
అంబులెన్సులో ఎక్కిస్తూ...

సంతోషంతో చిన్నారి కేరింతలు

తల్లి, తమ్ముడి వద్దకు పోలీసులను తీసుకెళ్లిన తర్వాత.. ఇక నా తల్లికి ఏం కాదని ఆనందంతో కేరింతలు కొట్టింది. విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం తల్లి, తమ్ముడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. అయితే ఆమె స్పృహలో లేకపోవడం వల్ల వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తున్నారో అధికారులు గుర్తించలేకపోయారు.

ఇదీ చదవండి:Viral: టీ స్టాల్​లో ప్లేట్లు కడిగిన కోతి!

ABOUT THE AUTHOR

...view details