సొంత సోదరిపైనే ఓ యువకుడు హత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణంగా రేప్ చేసి, చంపాడా దుండగుడు. ఆపై.. బెడ్ బాక్స్‌లో మృతదేహాన్ని పెట్టి పరారయ్యాడు.
ఏప్రిల్ 6న ఉత్తర్‌ప్రదేశ్ ఆజంగఢ్‌లోని గంభీర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అరెస్ట్..
తన తండ్రి, చెల్లి మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు నిందితుడు. అత్యాచారం చేసి, పదునైన ఆయుధంతో ఆమెను పొడిచి చంపాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
బెడ్ బాక్స్ నుంచి పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళన