కరోనా(Corona) సోకకుండా నివారించటం సహా చికిత్సలోనూ ఉపకరించే ఆయుర్వేద ఉత్పత్తి 'కొవిరక్ష'ను భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) అంకుర సంస్థ నూతన్ ల్యాబ్స్ మంగళవారం.. బెంగళూరులో ఆవిష్కరించింది. కర్ణాటక ఆయుష్ శాఖ అనుమతి పొందిన ఈ ఆయుర్వేద తైలం తయారీలో రజత భస్మం (సిల్వర్ కొలాయిడల్)తో పాటు పలు వనమూలికలు ఉపయోగించినట్లు ఈ సంస్థ ప్రకటించింది.
సెంటర్ ఫర్ నానో సైన్స్ ఇంజినీరింగ్ (సీఎన్‌ఎస్‌ఈ), టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ (టీబీఐ) సాంకేతిక సహకారంతో ఈ తైలాన్ని తయారు చేసినట్లు సంస్థ ప్రధాన పరిశోధకుడు హెచ్.ఎస్.నూతన్ తెలిపారు. ఈ తైలానికి గత వారం ఆయుష్ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు.