Auto driver rapes Nepalese girl: నేపాలీ మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆటోడ్రైవర్ సహా మరో ఇద్దరిని మహారాష్ట్రలోని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
"బాధితురాలు ఉద్యోగం కోసం నేపాల్ నుంచి భారత్‌కు వచ్చింది. ఉపాధి కోసం అన్వేషించి అలసిపోయిన బాలిక తాను ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు హడప్‌సర్ ప్రాంతంలో ఆటో ఎక్కింది. క్షేమంగా గమ్యం చేరుకుంది. అయితే డబ్బులు లేక ఆటో ఛార్జీ చెల్లించలేకపోయింది. దీంతో ఆ ఆటోడ్రైవర్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేశాం" అని హడప్‌సర్ పోలీసులు తెలిపారు.