రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. గుర్తుతెలియని దుండగులు రాజసమంద్కు చెందిన ఓ పూజారి దుకాణంపై పెట్రోల్ బాంబ్‌తో దాడి చేశారు. షాప్‌లో ఉన్న పూజారి, ఆయన భార్య మంటల్లో కాలిపోయారు. 80 శాతం కాలిన గాయాలైన వారిద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు అధికారి సైతాన్ సింగ్ నథావత్.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
పూజారిపై పెట్రోల్ బాంబ్‌తో దాడి.. కుటుంబాన్ని చంపి వ్యక్తి ఆత్మహత్య - rajasthan Attempted to burn priest couple alive
రాజస్థాన్‌లో గుర్తుతెలియని దుండగులు పూజారిపై పెట్రోల్ బాంబ్ విసిరారు. అక్కడే ఉన్న పూజారి, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, నలుగురు చిన్నారులు సహా సహా ఓ కుటుంబ సభ్యులంతా ఇంట్లో శవాలై కనిపించారు.
పూజారి దంపతులను సజీవ దహనం చేయడంపై భాజపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మండిపడింది. ఈ విషయానికి సంబంధించి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా, రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి... గహ్లోత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఓ పూజారిపై ఇలా దాడి జరగడం.. రాష్ట్ర ప్రభుత్వ మరణానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ ధ్వజమెత్తారు.
కుటుంబం అంతా...
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం నలుగురు పిల్లలు సహా కుటుంబ సభ్యులంతా తమ ఇంట్లో శవాలై కనిపించారు. స్థానికుల వివరాల ప్రకారం ఆ కుటుంబ పెద్ద పప్పు గమేటి- భార్య, పిల్లలను హత్య చేశాడు. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ ఇంట్లో పప్పు గమేటి, ముగ్గురు పిల్లల మృతదేహాలు వేలాడుతూ ఉన్నాయి. అతని భార్య, ఒక బిడ్డ మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్), డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం సాక్ష్యాధారాల సేకరణ కొనసాగుతోంది.