తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారుల స్కూల్​ బస్సుపై దుండగుల దాడి, పదునైన ఆయుధాలతో - బర్నాలా స్కూల్​ బస్ అటాక్​

పంజాబ్​ బర్నాలాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. స్కూల్​ పిల్లలతో వెళ్తున్న బస్సుపై కొందరు దుండగులు పదునైన కత్తులతో దాడి చేశారు. డ్రైవర్​ చాకచాక్యంతో వ్యవహరించి పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లాడు.

accused attack on school bus
బస్సులోని చిన్నారులు

By

Published : Aug 17, 2022, 11:54 AM IST

స్కూల్​ చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు దుండగులు దాడి చేశారు. బైక్​పై పదునైన కత్తులతో వచ్చిన దుండగులు.. బస్సును వెంబడించారు. ఈ ఘటన పంజాబ్​ బర్నాలాలో జరిగింది. బస్సు డ్రైవర్​పై దాడి చేయగా.. స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్​ చాకచాక్యంగా వ్యవహరించాడు. బస్సును వెంటనే సమీపంలోని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లాడు. దీంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది.

దుండగుల దాడిలో ధ్వంసమైన బస్సు
బస్సులోని చిన్నారులు

కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు తనతో గొడవ పడ్డారని.. అందుకు ప్రతీకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బస్సు డ్రైవర్​ చెప్పాడు. బస్సును ఆపాలంటూ నిందితులు వెంటపడ్డారని.. పదునైన కత్తులతో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. బస్సు డ్రైవర్​ను విచారించిన పోలీసులు.. పాత కక్షలతోనే గొడవ పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులను గుర్తించామని.. వారిలో ఒకరిని ఇప్పటికే పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బస్సులోని చిన్నారులు
దుండగుల దాడిలో ధ్వంసమైన బస్సు

ABOUT THE AUTHOR

...view details