తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్లపై ఫేస్‌బుక్‌లో వ్యాఖ్య.. దేశద్రోహం కింద అరెస్ట్‌

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో చనిపోయిన జవాన్లపై ఫేస్​బుక్​లో చేసిన వ్యాఖ్యలపై అసోం రచయిత్రి శిఖాశర్మను దేశద్రోహం కింద అరెస్ట్​ చేశారు పోలీసులు. 14 రోజుల పాటు జ్యుడీషియల్​ కస్టడీ విధించారు.

Assamese writer Shikha sharma
అసోం రచయిత్రి శిఖాశర్మ

By

Published : Apr 8, 2021, 7:04 AM IST

మావోయిస్టుల కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌లో చనిపోయిన జవాన్లపై ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యకు గానూ అసోం రచయిత్రి శిఖాశర్మపై పోలీసులు దేశద్రోహం కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. నిందితురాలికి 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

ఇద్దరు భాజపా కార్యకర్తల ఫిర్యాదు ఆధారంగా శిఖాశర్మపై గువాహటిలోని దిస్పుర్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్​ 124ఏ(దేశ ద్రోహం) సహా ఇతర సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

"జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చనిపోతే వారిని మృతవీరులుగా పేర్కొనడం తగదు. విద్యుత్తు శాఖ ఉద్యోగి విద్యుదాఘాతంతో చనిపోతే అతనూ మృతవీరుడే అవుతారా? ప్రసార మాధ్యమాలు ప్రజల్ని భావోద్వేగానికి గురి చేయకూడదు" అని శిఖాశర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదీ చూడండి:బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో 23 మంది జవాన్లు మృతి

ABOUT THE AUTHOR

...view details