తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫుడ్​ డెలివరీ ముసుగులో డ్రగ్స్ విక్రయం! - గువహటి డ్రగ్స్ వార్త

ఫుడ్​ డెలివరీ ముసుగులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అసోంలోని గువాహటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 ప్యాకెట్ల బ్రౌన్​ షుగర్​ స్వాధీనం చేసుకున్నారు.

food delivery boys drug peddling
ఫుడ్​ డెలివరీ పేరుతో డ్రగ్స్ అమ్మకం

By

Published : Jun 9, 2021, 1:01 PM IST

మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురు ఫుడ్​ డెలివరీ బాయ్స్​ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 ప్యాకెట్ల బ్రౌన్​ షుగర్​ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 గ్రాములు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది.

గువాహటిలోని పల్టాన్​ బజార్​లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫుడ్​ డెలివరీ ముసుగులో డ్రగ్స్​ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. నిందితులు జొమాటో, స్విగ్గీలో పనిచేస్తూ.. డ్రగ్స్​ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాల కోసం నిందితుల ఇళ్లలో సోదాలు జరిపినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details