తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్రివర్ణాలతో రైతుల వెదురు గుడిసెలు - రైతుల వెదురు గుడిసెలు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. ఎండలను తట్టుకునేందుకు గాజీపుర్ సరిహద్దు వద్ద వెదురు బొంగులతో గుడిసెలను నిర్మించుకున్నారు. త్రివర్ణ పతాకం ప్రతిబింబించేలా నివాసాలకు జాతీయ జెండా రంగులను వేశారు.

As NCR reels under heat, farmers at Ghazipur (Delhi-UP) border are building tricolour-themed bamboo huts.
త్రివర్ణాలు అద్ది వెదురు గుడిసెలను నిర్మించిన రైతులు

By

Published : Apr 4, 2021, 12:33 PM IST

జాతీయ జెండా రంగులతో వెదురు గుడిసెలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. గాజీపుర్​ సరిహద్దు వద్ద తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వెదురు బొంగులతో గుడిసెలను నిర్మించారు. త్రివర్ణపతాకం ప్రతిబింబించేలా జాతీయ జెండా రంగులను గుడిసెలకు అద్దారు. పర్యావరణ రహితంగా గుడిసెలను నిర్మించినట్లు ఓ రైతు తెలిపారు. ధైర్యం, ఉత్సాహం కోసం నివాసాలపై త్రివర్ణ పతాక రంగులను వేశామన్నారు.

వెదురు బొంగులతో నిర్మించిన గుడిసెలు
జాతీయ జెండా రంగులతో నివాసాలు
రంగులను అద్దుతున్న రైతులు

రైతులు.. తమ సంకల్పం ఎంత దృఢమైనదో తెలిపేందుకు గతంలోనూ సరిహద్దుల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో నాలుగు నెలలకుపైగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి :కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్​పై మోదీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details