కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. షిర్డీ సాయిని(shirdi temple news) దర్శించుకునేందుకు ఆఫ్‌లైన్ పాసుల ద్వారా రోజుకు మరో 10 వేల మందిని అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు అక్టోబర్ 6న రోజుకు 15వేల మంది భక్తులకు బాబా దర్శనం(shirdi saibaba darshan) కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో మొత్తంగా రోజుకు 25వేల మంది ఆ సాయినాథుడిని దర్శించుకునే(shirdi temple open) అవకాశం లభించినట్లయింది.
"సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఇటీవల జరిగిన సమావేశంలో మరింత మందిని అనుమతించాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం ప్రకారం కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ.. ప్రతిరోజు ఆఫ్‌లైన్ పద్ధతిన అధనంగా మరో 10వేల మంది భక్తులను అనుమతించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ ట్రస్ట్ హామీ ఇచ్చింది. "
- రాజేంద్ర భోస్లే, అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్.