Arrested Person Hanged In jail: ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్ జైలులో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ మిశ్రా విచారణకు ఆదేశించినట్లు అధికారి తెలిపారు. దీంతో డీఎం మిశ్రా, పోలీస్ సూపరింటెండెంట్ ప్రశాంత్ వర్మ జైలును సందర్శించి విచారణ చేపట్టారు.
కన్నౌజ్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక.. 21 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు పెట్టింది. దీంతో అతడిని మార్చి 24న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నీటి పైప్‌లైన్‌కు కండువాతో ఉరివేసుకున్నట్లు జైలు సూపరింటెండెంట్ విష్ణుకాంత్ మిశ్రా తెలిపారు. పెళ్లి సాకుతో తనపై అత్యాచారం చేశాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.