తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో పేలుడు పదార్థాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు స్వాధీనం

కశ్మీర్​లో విధ్వంస కాండను ముందే అడ్డుకోగలిగింది ఆర్మీ. కుప్వారా జిల్లాలో పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

Army recovers explosives from Karnah, Kupwara
కశ్మీర్​లో పేలుడు పదార్థాలు స్వాధీనం

By

Published : Apr 6, 2021, 6:17 AM IST

Updated : Apr 6, 2021, 6:48 AM IST

కశ్మీర్​లో భారీ ప్రమాదాన్ని నిరోధించింది భారత సైన్యం. కుప్వారా జిల్లాలోని కర్నా ప్రాంతంలో ప్లాస్టిక్​తో కూడిన పేలుడు పదార్థాలు(15 స్టిక్స్​) స్వాధీనం చేసుకుంది.

ఈ నెల 4న తంగ్ధర్​లోని జామా మసీదు వద్ద పేలుడు పదార్థాలను తరలిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షించాయి. ఈ నెల 5న ఆర్మీ బాంబు డిస్పోజల్ బృందం చేసిన సమగ్ర సోదాల్లో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అనుమానాస్పద పెట్టె స్వాధీనం..

శ్రీనగర్​లోని ఖన్యర్​లో ఓ అనుమానాస్పద పెట్టెను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బయటి నుంచి కొన్ని వైర్లు కనిపిస్తున్నందు వల్ల దాంట్లో పేలుడు పదార్థాలు ఉండొచ్చని సమాచారం అందినట్లు వారు తెలిపారు. అయితే అలాంటిదేదీ అందులో లేదని పోలీసులు నిర్ధరించారు. స్థానికుల్లో భయాందోళనలను సృష్టించేందుకు కొందరు ఆకతాయిలు చేసిన పనిగా అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి:చీనాబ్​ రైల్వే వంతెన ఆర్చ్​ నిర్మాణం పూర్తి

Last Updated : Apr 6, 2021, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details