సాయుధ దళాలు, శాస్త్రవేత్తలు అత్యంత విశ్వసనీయత కలిగిన వ్యక్తులుగా దేశ ప్రజలు గుర్తించారు(ipsos global news). రాజకీయ నేతలు, యాడ్ ఏజెన్సీలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లపై తమకు విశ్వాసం లేదని స్పష్టం చేశారు(ipsos research).
ఇప్సోస్ గ్లోబల్ ట్రస్ట్వర్తీనెస్ ఇండెక్స్-2021 ప్రకారం సాయుధ దళాలు(64శాతం), శాస్త్రవేత్తలు(64శాతం), టీచర్లు(61శాతం), డాక్టర్ల(58శాతం)పై ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉంది. రెండేళ్ల ముందు జరిగిన సర్వేలోనూ సాయుధ దళాలే టాప్‌లో నిలిచాయి. శాస్త్రవేత్తలపై నమ్మకం పెరిగింది మాత్రం ఈ కరోనా కాలంలోనే! రోగుల ప్రాణాలు రక్షించేందుకు, టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రజలు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగానూ ఇంచుముంచు ఇవే గణాంకాలు ఉన్నాయి. వైద్యులు(64శాతం), శాస్త్రవేత్తలు(61శాతం), టీచర్ల(55శాతం)కు సర్వేలో ఎక్కువ మార్కులు దక్కాయి.
"సాయుధ సిబ్బంది సొంత ప్రయోజనాలను లెక్కచేయకుండా, సేవ చేస్తారు, త్యాగాలు చేస్తారు. సరిహద్దు రక్షణలో వారికి అంకితభావం ఎక్కువ. అందుకే వారిపై భారతీయులకు నమ్మకం ఎక్కువ. అదే విధంగా శాస్త్రవేత్తలకు కరోనా వారియర్స్‌గా గుర్తింపు లభించింది. వైరస్‌కు టీకా కనుగొనేందుకు నిత్యం కృషి చేశారు. అందుకే వీరికి, సాయుధ దళాలతో సమానమైన స్థానాన్ని ఇచ్చారు. టీచర్లు, వైద్యులకు తర్వాతి స్థానాలను అప్పగించారు."