ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే.. ఒక రోజు పాటు నిరాహార దీక్ష చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు చేపట్టిన భారత్ బంద్కు మద్దతుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు హజారే.
రైతన్నకు మద్దతుగా హజారే నిరాహార దీక్ష - రైతు నిరసనలు
రైతులకు మద్దతుగా ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేపట్టారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని... అప్పుడే కేంద్రం దిగొచ్చి రైతులకు న్యాయం చేస్తుందని అన్నారు. అయితే హింసకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.
రైతన్నకు మద్దతుగా అన్న హజారే నిరాహార దీక్ష
రైతు నిరసనలు దేశవ్యాప్తంగా జరగాలని.. అప్పుడే కేంద్రం దిగొచ్చి అన్నదాతలకు న్యాయం చేస్తుందని తెలిపారు హజారే. గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతన్నలను ప్రశంసించారు. అయితే నిరసనల్లో ఎవరూ హింసకు పాల్పడవద్దని సూచించారు.
ఇవీ చూడండి:-