అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో పురాతన కళాఖండాలు లభించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రాంత అధికారి ప్రకాశ్ గుప్తా తెలిపారు. పునాది కోసం జరిపిన తవ్వకాల్లో విరిగిన విగ్రహాలు, ఆలయ అవశేషాలు, స్తంభాలు, రాళ్లు, సీతా దేవి వంట గదిలోని వస్తువులు బయటపడ్డాయని వెల్లడించారు.
అయోధ్య గుడి తవ్వకాల్లో సీతా దేవి వస్తువులు! - రామ మందిరం
అయోధ్య రామమందిర నిర్మాణానికి చేపట్టిన తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడ్డాయి. అందులో విరిగిన విగ్రహాలు సహా సీతా దేవి వంట గదిలోని సామాన్లు ఉన్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
అయోధ్యలో బయటపడిన పురాతన కళాఖండాలు
ఈ అవశేషాలను రామ జన్మభూమి ఆవరణలోనే భద్రపరచనున్నట్లు ప్రకాశ్ గుప్తా తెలిపారు. ఆలయం నిర్మించిన తర్వాత ఏర్పాటు చేసే మ్యూజియంలో వాటిని ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. అంతకుముందు శివ లింగం, ఇతర అవశేషాలను వెలికితీసినట్లు తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది.
ఇదీ చూడండి:'అయోధ్య రామాలయం కోసం రూ.3000 కోట్ల విరాళాలు'