భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం.. పంజాబ్లో కుప్పకూలింది. మంటలు చెలరేగి.. విమానం కాలిబూడిదైంది. పంజాబ్లోని మోగా సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మృతి చెందారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు వాయుసేన వర్గాలు తెలిపాయి.
ఈ దుర్ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మిగ్ యుద్ధవిమానం కూలిపోవటానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని తేల్చనున్నారు.