Amravati waterman: అడవి మార్గంలో వెళ్లే వారి దాహాన్ని తీర్చుతున్నాడు అతడు. మూగ జీవాల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి మంచి మనసును చాటుకుంటున్నాడు. గత 26 ఏళ్లుగా ఈ సేవలను కొనసాగిస్తున్నాడు మహారాష్ట్ర అమరావతికి చెందిన వివేక్ చర్జన్. అందుకే అతడ్ని ఆ ప్రాంతవాసులంతా 'వాటర్‌మ్యాన్' అని పిలుచుకుంటారు.
అమరావతి-చండూర్ రహదారి.. పోహ్రా, చిరోడి అడవుల గుండా సుమారు 15-20 కిలోమీటర్లు ఉంటుంది. పాల వ్యాపారులు, చిరు వ్యాపారులు ఈ దారిలో ఎక్కువగా ప్రయాణిస్తారు. వీరిలో చాలా మంది ప్రయాణానికి సైకిల్, మోటర్ బైక్ వాడతారు. వేసవి కాలంలో వీరి దాహం తీర్చేందుకు తనవంతు ప్రయత్నిస్తున్నాడు వివేక్. ఉదయం 10 గంటల నుంచి ఆ మార్గంలో వెళ్లేవారికి చల్లటి నీరు అందిస్తున్నాడు.