Amazon ED news: ఈడీకి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్. తమ ఉద్యోగులకు అనవసరంగా ఇస్తున్న సమన్లపై స్పష్టత కావాలని కోరింది. ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంలో అమెజాన్ ఎఫ్ఈఎమ్ఏ నిబంధనలు ఉల్లంఘించినట్టు వస్తున్న ఆరోపణలపై ఈడీ విచారణ పరిధిని కూడా ప్రశ్నించింది. విచారణలో తమ ఉద్యోగులకు సంబంధం లేని ప్రశ్నలన్నీ అడిగి తమను ఈడీ చిత్రహింసలు పెడుతోందని పిటిషన్లో పేర్కొంది.
'ఈడీ చిత్రహింసలు పెడుతోంది'- దిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్
Amazon ED summons: తమ ఉద్యోగులకు అనవసరంగా సమన్లు జారీ చేసి ఇబ్బందిపెడుతోందని ఈడీకి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది అమెజాన్. ఈడీ విచారణను నిలిపివేయాలని కోరింది.
'ఈడీ చిత్రహింసలు పెడుతోంది'- దిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్
సంబంధిత విషయంలో ఈడీ ఎలాంటి దర్యాప్తు చేయకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది అమెజాన్. ఈ వ్యవహారంపై దిల్లీ హైకోర్టు.. గురువారం విచారణ చేపట్టే అవకాశముంది.
ఇదీ చూడండి:-అమెజాన్‌కు రూ.202 కోట్ల ఫైన్- 'ఫ్యూచర్ డీల్' అనుమతులు రద్దు