అన్ని విషయాల్లో పంజాబ్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో కలిసి నిరసన చేపట్టారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి పట్టించుకోవటం లేదని ఆరోపించారు అమరీందర్.
నిరసనలో భాగంగా పంజాబ్ ఎమ్మెల్యేలు.. బుధవారం ఉదయం దిల్లీలోని పంజాబ్ భవన్ నుంచి జంతర్‌మంతర్ వరకు కాలినడకన వెళ్లారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
పంజాబ్‌లో రైతుల నిరసనల నేపథ్యంలో గూడ్స్ రైళ్లను నిలిపేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా అనుమతించకపోవటంపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. బొగ్గు, యూరియా, డీఏపీ నిండుకున్నాయని.. ఫలితంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.