All India strike in march 2022: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె తలపెట్టినట్లు కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. కార్మిక, కర్షకులు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జాయింట్ ఫోరం తెలిపింది. మార్చి 22న ఈ మేరకు దిల్లీ వేదికగా ఐక్య సమావేశం నిర్వహించినట్లు ఫోరం ఓ ప్రకటనలో తెలిపింది.
ఎస్మా భయాలున్నా రోడ్ వేస్, ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని పేర్కొంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌కు చెందిన ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు కానున్నారని తెలిపింది. కోల్, స్టీల్, ఆయిల్, టెలికాం, పోస్టల్, ఇన్‌కమ్ ట్యాక్స్, కాపర్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ ఇలా ఆయా రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చాయని పేర్కొంది. రైల్వే, రక్షణ రంగ యూనియన్లు సైతం సమ్మెకు మద్దతుగా పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనున్నాయని ఫోరం తెలిపింది.
సమ్మె ఇందుకే..