తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AIIMS Jobs 2023 : ఎయిమ్స్​లో గ్రూప్​ - ఏ, గ్రూప్​ - బి పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

AIIMS Jobs 2023 : దేశంలోని పలు ఎయిమ్స్​ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న నాన్​- ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. మరి ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తుకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, జీతభత్యాలు తదితర వివరాలు మీ కోసం.

AIIMS Recruitment 2023
AIIMS Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 11:46 AM IST

​AIIMS Jobs 2023 :​ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్ ​(ఎయిమ్స్)​లో ఉద్యోగం సంపాదించాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్​న్యూస్​. మహారాష్ట్ర- నాగ్​పుర్​, ఝార్ఖండ్​- దేవ్​ఘర్​, బంగాల్​- కళ్యాణిలోని ఎయిమ్స్​ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

AIIMS Kalyani Recruitment 2023 :
బంగాల్​లోని కళ్యాణి.. ఎయిమ్స్​లో మొత్తం 76 గ్రూప్​- ఏ, బీ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అసిస్టెంట్​ కంట్రోలర్​​ ఆఫ్​ ఎగ్జామినేషన్ 01
అసిస్టెంట్​ నర్సింగ్​ సూపరింటెండెంట్​ 27
చీఫ్ నర్సింగ్ ఆఫీసర్​ 01
ఎగ్జిక్యుటివ్​ ఇంజినీర్​(ఏ/సీ అండ్​ ఆర్) 01
ఎగ్జిక్యుటివ్​ ఇంజినీర్(సివిల్​) 01
ఎగ్జిక్యుటివ్​ ఇంజినీర్(ఎలక్ట్రికల్​) 01
మెడికల్​ సూపరింటెండెంట్ 01
నర్సింగ్​ సూపరింటెండెంట్ 02
ప్రిన్సిపల్​ ప్రైవేట్​ సెక్రేటరీ 01
రిజిస్ట్రార్​ 01
సీనియర్​ అకౌంట్స్​ ఆఫీసర్​ 01
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ 01
సీనియర్ స్టోర్స్​ ఆఫీసర్ 01
స్టోర్స్​ ఆఫీసర్ 01
అసిస్టెంట్​ అకౌంట్స్​ ఆఫీసర్​ 02
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ 02
అసిస్టెంట్ ఇంజినీర్​(ఏ/సీ అండ్​ ఆర్) 01
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్​) 01
అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్​) 01
అసిస్టెంట్ సెక్యురిటీ ఆఫీసర్​ 01
అసిస్టెంట్ స్టోర్స్​ ఆఫీసర్ 02
చీఫ్​ ఫార్మాసిస్ట్​ 01
ఎగ్జిక్యుటివ్ అసిస్టెంట్(ఎన్​.ఎస్) 06
లైబ్రేరియన్​ గ్రేడ్​-I 01
పర్సనల్​ అసిస్టెంట్​ టు ప్రిన్సిపాల్​(ఎస్​) 02
ప్రైవేట్​ సెక్రటరీ 01
శానిటేషన్​ ఆఫీసర్ 01
సీనియర్ శానిటేషన్​ ఆఫీసర్ 01
సీనియర్ ఫార్మాసిస్ట్ 01
టెక్నిషీయన్స్​(లేబరేటరీ) 08
అప్పర్​ డివిజన్​ క్లర్క్​ 03
మొత్తం ఖాళీలు 76

ఏజ్​ లిమిట్​..
2023 అక్టోబర్​ 22 నాటికి అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు..
పై ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవెల్​ 4, 6, 7, 10, 11, 12, 14 కింద వేతనం చెల్లిస్తారు.

ఎంపిక విధానం..
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

3 ఏళ్ల సర్వీస్​..
ఉద్యోగానికి ఎంపికైన వారు విధిగా 3 సంవత్సరాలు ఎయిమ్స్​లో పనిచేయాల్సి ఉంటుంది. డీఓపీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత పోస్టు సర్వీస్​ల​ను 7 ఏళ్ల వరకు పొడిగిస్తారు.

దరఖాస్తు విధానం..
అభ్యర్థులు The Executive Director, All India Institute of Medical Sciences (AIIMS), Kalyani, 1st Floor, Administrative Building, NH-34 Connector, Basantapur, Saguna, Kalyani, District Nadia, West Bengal 741245 చిరునామాకు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు ప్రారంభ తేదీ - 2023 సెప్టెంబర్ 23
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 2023 అక్టోబర్​ 22

అఫీషియల్​ వెబ్​సైట్​..
పై పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు సహా, ఇతర వివరాల గురించి ఎయిమ్స్​ అధికారిక వెబ్​సైట్ https://aiimskalyani.edu.in/​ను చూడవచ్చు.

AIIMS Nagpur Recruitment 2023 :
మహారాష్ట్రలోని నాగ్​పుర్​ ఎయిమ్స్​లో మొత్తం 68 నాన్​-ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మెడికల్ ఫిజిసిస్ట్​ 02
క్లినికల్ సైకాలజిస్ట్ 01
మెడికల్​ ఆఫీసర్​(ఆయూష్​) 01
యోగా ఇన్​స్ట్రక్టర్ 01
అసిస్టెంట్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్ 02
ఎగ్జిక్యూటివ్​ అసిస్టెంట్​(ఎన్​.ఎస్) 04
స్టోర్​ కీపర్ 04
జూనియర్​ ఇంజినీర్​(ఏ/సీ అండ్​ ఆర్) 01
జూనియర్ ఇంజినీర్(సివిల్​) 01
జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్​) 01
జూనియర్ ఫిజియోథెరపిస్ట్​ 01
జూనియర్ ఆడియాలజిస్ట్​/స్పీచ్​ థెరపిస్ట్​ 02
లైబ్రరీ అండ్​ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్​ 01
ఆప్టోమెట్రిస్ట్ 02
టెక్నిషీయన్​(లేబారేటరీ) 16
టెక్నిషీయన్​(రేడీయాలజీ) 02
ఫార్మాసిస్ట్​ 05
ఫైర్​ టెక్నిషీయన్ 02
మెడికల్​ రికార్డ్ టెక్నిషీయన్స్​ 02
స్టెనోగ్రాఫర్​ 04
లాండ్రీ సూపర్​వైజర్​ 01
జూనియర్​ వార్డెన్​ 02
జూ.అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(ఎల్​డీసీ) 10
మొత్తం ఖాళీలు 68

ఎంపిక విధానం..
కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​, స్కీల్​ టెస్ట్​, స్క్రీనింగ్​ టెస్ట్​, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్​ ఫీజు..

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్​-సర్వీస్​మెన్ అభ్యర్థులకు- రూ.1,000/-
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు- రూ.800/-
  • దివ్యాంగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు చివరి తేదీ..
దరఖాస్తును నోటిఫికేషన్​ ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా ఎయిమ్స్​ దేవ్​ఘర్​ చిరునామాకు పంపాలి.

అధికారిక వెబ్​సైట్​..
పై పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు సహా నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం AIIMS నాగ్​పుర్ అధికారిక వెబ్​సైట్ https://www.aiimsnagpur.edu.in/ను వీక్షించవచ్చు.

AIIMS Deoghar Recruitment 2023 :
ఝార్ఖండ్​ దేవ్‌ఘర్‌ జిల్లా ఎయిమ్స్‌లోని వివిధ విభాగాల్లో 40 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఖాళీలు..
జూనియర్ రెసిడెంట్ ​(నాన్​ అకడమిక్​)- 40 పోస్టులు

అర్హత..
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్​స్టిట్యూట్ నుంచి గ్రాడ్యూయేట్​ (ఎంబీబీఎస్​) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు 33 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము..

  • అన్​రిజర్వ్​డ్​ కేటగిరీ అభ్యర్థులకు- రూ.3,000/-
  • ఓబీసీ అభ్యర్థులకు- రూ.1,000/-
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్​ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

నోటిఫికేషన్​ తేదీ..

  • 2023 అక్టోబర్​ 10

దరఖాస్తు చివరి తేదీ..
ఆఫ్​లైన్​ దరఖాస్తును నోటిఫికేషన్​ ప్రచురితమైన తేదీ నుంచి 15 రోజుల్లోగా ఎయిమ్స్​ దేవ్​ఘర్​ చిరునామాకు పంపాలి.

అధికారిక వెబ్​సైట్​..
చిరునామా సహా మరిన్ని వివరాల కోసం దేవ్​ఘర్ ఎయిమ్స్​ అఫీషియల్​ వెబ్​సైట్​ https://www.aiimsdeoghar.edu.in/ను చూడవచ్చు.

UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. UCILలో 243 అప్రెంటీస్ పోస్టులు​.. అప్లై చేసుకోండిలా!

IB Recruitment 2023 : ఇంటెలిజెన్స్​ బ్యూరోలో ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే

AAI junior executive jobs 2023 : బీఈ/ బీటెక్ అర్హతతో.. AAIలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. లక్షల్లో జీతం!

ABOUT THE AUTHOR

...view details