AIADMK Party: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే కీలక పదవుల్లో.. మళ్లీ మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఉండనున్నారు. పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డిసెంబర్ 4న వీరు నామినేషన్లు సమర్పించగా.. పోటీ లేకుండానే విజయం పొందారు.
ఎన్నికలకు ముందు పార్టీ బైలాస్‌ను సవరించి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్, ఈపీఎస్ సఫలమయ్యారు.
శశికళకు ఇక కష్టమే..!
అన్నాడీఎంకే పార్టీలో 2017లో తొలిసారిగా పార్టీ నిబంధనలను సవరించారు. జనరల్ సెక్రటరీ స్థానాన్ని తొలగించి పార్టీ సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త స్థానాలకు అధికారాన్ని కల్పించారు. రెండు పదవులు ఉన్నా.. సమాన అధికారం ఉండేలా మార్పులు చేశారు.
అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన శశికళను పదవిలో నుంచి తొలగించి.. పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అక్రమాస్తుల కేసుల్లో.. దోషిగా తేలిన ఆమె జైలు జీవితం గడిపారు.