తాము ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లకు కేంద్రం ఇండెమ్నిటీ(indemnity) ప్రకటించాలని సీరం సంస్థ(Serum) విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ విదేశీ తయారీ సంస్థలకు చట్టపరమైన చిక్కుల నుంచి రక్షణ కల్పిస్తే సీరంతో(Serum) దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు కూడా అలాంటి రక్షణే ఇవ్వాలని కోరినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని వ్యాక్సిన్ సంస్థలకు ఈ ఇండెమ్నిటీని ప్రకటించాలని సీరం వర్గాలు అభిప్రాయపడ్డాయి.
భారత్లో వ్యాక్సిన్లు పంపిణీ చేయాలంటే ఇండెమ్నిటీ (indemnity) ప్రకటించాలని ఇటీవల విదేశీ వ్యాక్సిన్ సంస్థలైన ఫైజర్, మోడెర్నా కేంద్రాన్ని కోరాయి. ఆ సంస్థల విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.