కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. కర్ణాటక, ధార్వాడ్‌లోని వైద్య కళాశాలలో 182 మందికి వైరస్ సోకిన సంఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే.. అదే రాష్ట్రంలోని ఓ పాఠశాలలో భారీగా కేసులు బయటపడ్డాయి. బెంగళూరు అర్బన్ జిల్లా, అనెకల్ తాలుకలోని దొమ్మసంద్రలోని బోర్డింగ్ పాఠశాలలో 33 మంది విద్యార్థులు సహా ఓ ఉపాధ్యాయుడికి కొవిడ్-19 వైరస్ పాజిటివ్‌గా(Covid-19 latest news) తేలింది.
పాఠశాలలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు "దొమ్మసంద్రలోని ది ఇంటర్నేషనల్ బెంగళూరు బోర్డింగ్ పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం 282 మంది హాజరవుతున్నారు. కొంత మంది మహదేవపుర నుంచి పాఠశాలకు వస్తున్నారు. వారి నుంచే కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నాం. "
- విజయ్ కుమార్, ఆరోగ్య అధికారి.
కరోనా నిర్ధరణ(Corona virus latest news) అయిన విద్యార్థులు, ఉపాధ్యాయుడిని పాఠశాలలోనే క్వారంటైన్లో ఉంచారు. జిల్లా ఆరోగ్య విభాగం అధికారులు పాఠశాలను సందర్శించారు.
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న జిల్లా అధికారులు కొద్ది రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భౌతిక తరగతులను మూసివేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కాటవం ఆందోళన కలిగిస్తోంది.
కొంప ముంచిన ఫ్రెషర్స్ పార్టీ...
రాష్ట్రంలో కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు.. వైద్య కళాశాలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్ కె. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారని వివరించారు. గురువారం మొత్తం 300 మందికి పైగా వైద్యపరీక్షలు నిర్వహించగా.. 66 మంది వైరస్ బారిన(Covid-19 karnataka) పడ్డారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 182కు చేరినట్లు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన వారిని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామన్నారు. ఇప్పటికే క్యాంపస్‌లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా కొత్త వేరియంట్‌పై భారత్ కీలక ప్రకటన- ఆ దేశాల్లో ఆంక్షలు