yogi adityanath news: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన వారాణాసి నుంచి లఖ్‌నవూకు వెళుతుండగా ఓ పక్షి హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో ఉంచుకునే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ కౌషల్రాజ్ శర్మ తెలిపారు. ల్యాండ్ చేసిన అనంతరం యోగి సర్కూట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత బబత్పుర్ విమానాశ్రయం నుంచి విమాన మార్గంలో లఖ్‌నవూ వెళ్లనున్నారు.
అత్యవసరంగా ల్యాండ్ చేసిన ముఖ్యమంత్రి యోగి హెలికాప్టర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం వారాణాసి చేరుకున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయంలో పూజలు చేసిన యోగి.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం అభివృద్ధి పనులను పర్యవేక్షించి 9 గంటలకు లఖ్‌నవూకు తిరుగు ప్రయాణం అయ్యారు. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పడం వల్ల అధికార యంత్రాంగమంతా ఊపిరి పీల్చుకుంది.
ఇదీ చదవండి:ఫడణవీస్‌తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!